Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరు గడువు

Author
Posted By Amruth Varma Bolugoddu
| 31 Oct 2026, 12:38 PM | వరంగల్
పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరు గడువు

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ

వరంగల్‌, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తామని, 2023 అక్టోబర్ 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరు నమోదుకు అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు

పట్టభద్రులు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్‌సైట్ https://ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం-18 సమర్పించవచ్చని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో విద్యార్హత ధ్రువపత్రాలను జతచేసి సంబంధిత ఎన్నికల అధికారి కార్యాలయాల్లో అందజేయవచ్చని, పోస్టు ద్వారా కూడా పంపవచ్చని పేర్కొన్నారు. అన్ని విధానాల్లోనూ అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించడం తప్పనిసరి అన్నారు.

అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో అర్హత కలిగిన పట్టభద్రులెవరూ ఓటరు నమోదుకు దూరం కావొద్దని కలెక్టర్ కోరారు. రాజకీయ పార్టీలు, పట్టభద్రుల సంఘాలు, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాలు ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దరఖాస్తులను ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు.

ఓటరు నమోదు ప్రక్రియపై సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత ఎన్నికల నమోదు అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.