పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరు గడువు
ఆన్లైన్, ఆఫ్లైన్లో ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తామని, 2023 అక్టోబర్ 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరు నమోదుకు అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు...