Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 30 Oct 2026, 09:11 PM |
రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

గరిడేపల్లి, అక్టోబర్‌ 30 (ప్రజానేస్తం జ్వాల): రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.కె. యాకూబ్ పిలుపునిచ్చారు. ఈ మహాసభల ద్వారా రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల హక్కుల సాధనకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు మహాసభలకు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా రైతుల సంక్షేమానికి ఆశించిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయడంతో పాటు రైతుబంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో సైదిరెడ్డి, సీతారాం రెడ్డి, జాన్ సైదా, వెంకన్న, సైదా నాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.