రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

గరిడేపల్లి, అక్టోబర్‌ 30 (ప్రజానేస్తం జ్వాల): రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్.కె. యాకూబ్ పిలుపునిచ్చారు. ఈ మహాసభల ద్వారా రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల హక్కుల సాధనకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు మహాసభలకు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా రైతుల సంక్షేమానికి ఆశించిన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు...