Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. 107 మందికి పరీక్షలు, 29 మందికి పాజిటివ్!

Author
Posted By Amruth Varma Bolugoddu
| 30 Oct 2026, 03:45 PM | వరంగల్
వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. 107 మందికి పరీక్షలు, 29 మందికి పాజిటివ్!

వరంగల్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా 107 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను స్వాధీనం చేసుకున్నారు. PITA చట్టం కింద ఒక కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ సరఫరా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని, డ్రగ్స్ లేదా ఇతర నేరాల సమాచారం డయల్ 100/112కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఇన్‌చార్జి ఏసీపీ నరసింహారావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.