వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. 107 మందికి పరీక్షలు, 29 మందికి పాజిటివ్!
వరంగల్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 107 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను స్వాధీనం చేసుకున్నారు. PITA చట్టం కింద ఒక కేసు నమోదు చేశారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ఆకస్మిక...