Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వీరభద్రస్వామి దేవస్థానంలో నవంబర్ 6న టెండర్ కమ్ బహిరంగ వేలం

Author
Posted By Nagilla Rajinikanth
| 29 Oct 2026, 05:56 PM | హన్మకొండ
వీరభద్రస్వామి దేవస్థానంలో నవంబర్ 6న టెండర్ కమ్ బహిరంగ వేలం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2027 జాతర సందర్భంగా దేవస్థానానికి సంబంధించిన వివిధ హక్కుల కేటాయింపునకు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.

దేవస్థానం జారీ చేసిన ప్రకటన ప్రకారం 2026 నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు
శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు.

వేలం ద్వారా కేటాయించనున్న హక్కుల్లో కొబ్బరికాయలు,పూజా సామగ్రి విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, గుమ్మడికాయలు, కోరమీసాలు విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, ఎండుకొబ్బరి ముక్కలు, బియ్యం,కండువాలు,
బట్టలు,చీరెల సేకరణ విక్రయ హక్కుకు రూ.2 లక్షలు,పచ్చి కొబ్బరి ముక్కల సేకరణ హక్కుకు రూ.2 లక్షలు కనీస ధరగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా పుట్నాలు, ప్యాలలు విక్రయ హక్కుకు రూ.10 వేలు,పార్కింగ్ హక్కుకు రూ.50 వేలు, తలనీలాల సేకరణ హక్కుకు రూ.5 వేలు,విద్యుత్ దీపాలంకరణ (లైటింగ్) హక్కుకు రూ.10 వేలు, తడకలు–పందిర్లు వేయుటకు రూ.10 వేలు, రంగులు–సున్నాలు వేయుటకు రూ.10 వేలు, వంటపాత్రలు–టెంటు సామాగ్రి హక్కుకు రూ.10 వేలు కనీస ధరలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనే వారు దేవస్థానం నిర్దేశించిన నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి దేవస్థానం ప్రాంగణానికి హాజరై టెండర్ కమ్ బహిరంగ వేలంలో పాల్గొనాలని సూచించారు.