వీరభద్రస్వామి దేవస్థానంలో నవంబర్ 6న టెండర్ కమ్ బహిరంగ వేలం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2027 జాతర సందర్భంగా దేవస్థానానికి సంబంధించిన వివిధ హక్కుల కేటాయింపునకు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు. దేవస్థానం జారీ చేసిన ప్రకటన ప్రకారం 2026 నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. వేలం ద్వారా కేటాయించనున్న హక్కుల్లో కొబ్బరికాయలు,పూజా సామగ్రి విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, గుమ్మడికాయలు, కోరమీసాలు విక్రయ హక్కుకు రూ.3 లక్షలు, ఎండుకొబ్బరి ముక్కలు, బియ్యం,కండువాలు, బట్టలు,చీరెల సేకరణ విక్రయ హక్కుకు రూ.2 లక్షలు,పచ్చి కొబ్బరి...