Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాలల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట.. యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం ఒప్పందం

Author
Posted By Praja Nestham Jwala News
| 29 Oct 2026, 05:14 PM |
బాలల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట.. యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం ఒప్పందం

  • బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
    క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ.. పిల్లల సమస్యల పరిష్కారంపై కలెక్టర్ దిశానిర్దేశం


సూర్యాపేట, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

పిల్లల హక్కులను పరిరక్షిస్తూ, వారి స్వేచ్ఛ, అభిరుచులు, ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చేలా సూర్యాపేట జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

బాలల హక్కులు, మానసిక వికాసంపై ప్రత్యేక శిక్షణ

ఇవి కూడా చదవండి

బాలల హక్కుల పరిరక్షణ, వారి మానసిక వికాసం, అభిరుచులు, ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులు, విద్యాశాఖ క్లస్టర్, గ్రామస్థాయి రిసోర్స్ పర్సన్లు, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు బాలల అవసరాలపై అవగాహన కల్పించారు.

పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి అధికారి బాలల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలు తమ హక్కులను, స్వేచ్ఛను పూర్తిస్థాయిలో అనుభవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారిలోని నైపుణ్యాలు, అభిరుచులను గుర్తించి, తమ ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

బాలల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. యూనిసెఫ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం సూర్యాపేట జిల్లాను ఆదర్శ బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్స్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా రెవెన్యూ అధికారి రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనుష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. రవికుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉపేంద్ర, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.