బాలల స్నేహపూర్వక జిల్లాగా సూర్యాపేట.. యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం ఒప్పందం
బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ.. పిల్లల సమస్యల పరిష్కారంపై కలెక్టర్ దిశానిర్దేశం సూర్యాపేట, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): పిల్లల హక్కులను పరిరక్షిస్తూ, వారి స్వేచ్ఛ, అభిరుచులు, ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చేలా సూర్యాపేట జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా యూనిసెఫ్‌తో జిల్లా యంత్రాంగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. బాలల హక్కులు, మానసిక వికాసంపై ప్రత్యేక శిక్షణ బాలల హక్కుల...