Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నెక్కొండలో రూ.6 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Oct 2026, 04:50 PM | Crime
నెక్కొండలో రూ.6 లక్షల విలువైన గంజాయి పట్టివేత

  • 12 కిలోల ఎండు గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం

  • పట్టుబడ్డ నిందితుడు మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్.. మరో ఇద్దరు పరారీ

నెక్కొండ, అక్టోబర్ 27 (ప్రజానేస్తం జ్వాల):

వరంగల్ జిల్లా నెక్కొండ బస్టాండ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. సుమారు రూ.6 లక్షల విలువైన 12 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుబడగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలిపారు.

పట్టుబడ్డ వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నితిన్ న్యాను షిండేగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి వద్ద నుంచి 12 కిలోల ఎండు గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో తనిఖీల్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపినట్లు సమాచారం. పరారైన మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.