నెక్కొండలో రూ.6 లక్షల విలువైన గంజాయి పట్టివేత

12 కిలోల ఎండు గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం పట్టుబడ్డ నిందితుడు మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్.. మరో ఇద్దరు పరారీ నెక్కొండ, అక్టోబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ జిల్లా నెక్కొండ బస్టాండ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. సుమారు రూ.6 లక్షల విలువైన 12 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుబడగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు సమాచారం. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఒకరిని...