Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కల్వర్టును ఢీకొని కారులో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Oct 2026, 02:59 PM |
కల్వర్టును ఢీకొని కారులో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం

  • అడవి పందిని తప్పించబోయి ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నలుగురు ప్రయాణికులు

భీమదేవరపల్లి, అక్టోబర్ 27 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అడవి పందిని తప్పించబోయిన కారు కల్వర్టును ఢీకొని మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన అలువటి రఘు, పోతుగంటి అఖిల్ మరో ఇద్దరితో కలిసి హనుమకొండలో షాపింగ్ ముగించుకొని హుస్నాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గట్ల నర్సింగాపూర్–మంగళపల్లి మార్గంలో మంగళపల్లి సమీపంలో అకస్మాత్తుగా అడవి పంది ఎదురుకావడంతో దానిని తప్పించబోయి కారు కల్వర్టును ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న వంగర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కారు పూర్తిగా కాలిపోయినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.