కల్వర్టును ఢీకొని కారులో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం
అడవి పందిని తప్పించబోయి ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నలుగురు ప్రయాణికులు భీమదేవరపల్లి, అక్టోబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అడవి పందిని తప్పించబోయిన కారు కల్వర్టును ఢీకొని మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన అలువటి రఘు, పోతుగంటి అఖిల్ మరో ఇద్దరితో కలిసి హనుమకొండలో షాపింగ్ ముగించుకొని హుస్నాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గట్ల నర్సింగాపూర్–మంగళపల్లి మార్గంలో మంగళపల్లి సమీపంలో అకస్మాత్తుగా అడవి పంది ఎదురుకావడంతో దానిని తప్పించబోయి కారు కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదం...