Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దసరా రోజూ ఆగని నిరసన.. రెగ్యులరైజేషన్‌ కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన

Author
Posted By Praja Nestham Jwala News
| 21 Oct 2026, 09:22 AM |
దసరా రోజూ ఆగని నిరసన.. రెగ్యులరైజేషన్‌ కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. దసరా పండుగ రోజున కూడా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకుడు మహేందర్ రావు మాట్లాడుతూ, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న 78 కేడర్లకు చెందిన 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ఇప్పటికే రెగ్యులర్ చేసినప్పుడు, తెలంగాణలోనూ అదే విధంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.