దసరా రోజూ ఆగని నిరసన.. రెగ్యులరైజేషన్ కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన
హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. దసరా పండుగ రోజున కూడా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకుడు మహేందర్ రావు మాట్లాడుతూ, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న 78 కేడర్లకు చెందిన 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ఇప్పటికే రెగ్యులర్ చేసినప్పుడు,...