Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీసులమంటూ నగల వ్యాపారి కిడ్నాప్‌.. రూ.15 కోట్ల డిమాండ్‌

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 09:32 PM |
పోలీసులమంటూ నగల వ్యాపారి కిడ్నాప్‌.. రూ.15 కోట్ల డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): పోలీసులమంటూ ఓ నగల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి, కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్‌ చేసిన ముఠా రూ.1.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్‌ చేసి, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 53 ఏళ్ల కే. శ్రీనివాసరావు అక్టోబర్‌ 5న రామంతాపూర్‌లోని తన నగల దుకాణానికి వెళ్తుండగా గోల్నాక ఫ్లైఓవర్‌ సమీపంలో ముఠా సభ్యులు కిడ్నాప్‌ చేశారు. కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి, కుటుంబ సభ్యులను డబ్బుల కోసం బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. బోడుప్పల్‌లోని హేమానగర్‌ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వివాదమే కిడ్నాప్‌నకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు దుమావత్‌ శ్రీకాంత్‌ మరో ఇద్దరితో కలిసి ఆగస్టులోనే ఈ కిడ్నాప్‌కు ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించారు.

చిక్కడపల్లి పోలీసులు, సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.07 కోట్ల నగదు, 118.26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు వాహనాలు, తొమ్మిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నంబర్‌ ప్లేట్లతో వాహనాలు మారుస్తూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌పై గతంలో 16 చీటింగ్‌ కేసులు ఉన్నాయని, మరో నిందితుడిపై కూడా పలు ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. శ్రీనివాస్‌ రెడ్డితో సహా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన డబ్బు రికవరీ కోసం గాలింపు కొనసాగుతోంది.