పోలీసులమంటూ నగల వ్యాపారి కిడ్నాప్‌.. రూ.15 కోట్ల డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): పోలీసులమంటూ ఓ నగల వ్యాపారిని కిడ్నాప్‌ చేసి, కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్‌ చేసిన ముఠా రూ.1.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్‌ చేసి, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 53 ఏళ్ల కే. శ్రీనివాసరావు అక్టోబర్‌ 5న రామంతాపూర్‌లోని తన నగల దుకాణానికి వెళ్తుండగా గోల్నాక ఫ్లైఓవర్‌ సమీపంలో ముఠా సభ్యులు కిడ్నాప్‌ చేశారు. కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి, కుటుంబ సభ్యులను డబ్బుల కోసం బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. బోడుప్పల్‌లోని హేమానగర్‌ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వివాదమే కిడ్నాప్‌నకు...