Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సాగునీటి షెడ్యూల్ విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 09:19 PM |
సాగునీటి షెడ్యూల్ విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి

మఠంపల్లి, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రైతులకు సాగునీటి షెడ్యూల్ విడుదల చేసి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం మఠంపల్లి మండలం భీల్యానాయక్ తండా గ్రామంలో మాజీ సర్పంచ్ కోటా నాయక్ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలను, రైతుల సమస్యలను శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. సాగునీరు ఎప్పుడు వస్తుందో, విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీటి షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకుని, నష్టాల బారిన పడుతున్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని శానంపూడి సైదిరెడ్డి కోరారు.