సాగునీటి షెడ్యూల్ విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి

మఠంపల్లి, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రైతులకు సాగునీటి షెడ్యూల్ విడుదల చేసి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మఠంపల్లి మండలం భీల్యానాయక్ తండా గ్రామంలో మాజీ సర్పంచ్ కోటా నాయక్ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంటలను, రైతుల సమస్యలను శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే...