Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉద్యమకారుడు సైదులు మృతికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 09:18 PM |
ఉద్యమకారుడు సైదులు మృతికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు

నేరేడుచర్ల, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు అకాల మరణం పట్ల బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లుట్ల రఘు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సైదులు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా డాక్టర్ పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. సైదులు మృతి బాధాకరమని అన్నారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ ఉద్యమ నాయకుడు, అడ్వకేట్ నగేష్ రాథోడ్, మాజీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడియా శ్రీను నాయక్, నియోజకవర్గ నాయకులు ముల్కలపల్లి రాంబాబు, మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, జీలకర్ర రామస్వామి, జంపాల వెంకన్న, జింకల భాస్కర్, బుడిగ వెంకన్న, బుడిగ సతీష్, మాజీ సర్పంచ్ మేకపోతుల సైదులు, హుస్సేన్, శివాజీతో పాటు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.