ఉద్యమకారుడు సైదులు మృతికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు

నేరేడుచర్ల, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు అకాల మరణం పట్ల బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లుట్ల రఘు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సైదులు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. సైదులు మృతి బాధాకరమని అన్నారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ ఉద్యమ నాయకుడు,...