Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 07:55 PM |
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు, ఐటీ రంగంలో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి వరంగల్ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరంలో అత్యాధునిక ఐటీ టవర్లను నిర్మించి, స్థానిక యువతకు, నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వరంగల్‌ను సాంకేతిక రంగానికి కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన ‘కేయూ హబ్‌’ను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ధర్మసాగర్ నుంచి భద్రకాళి చెరువుకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వరంగల్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, ఉమ్మడి వరంగల్ ప్రాంత ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు.