హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు, ఐటీ రంగంలో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి వరంగల్ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరంలో అత్యాధునిక ఐటీ టవర్లను నిర్మించి, స్థానిక యువతకు, నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వరంగల్‌ను సాంకేతిక రంగానికి కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల...