Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాలనీలో వెలుగులు.. బస్టాండ్‌ వద్ద ప్రమాదానికి చెక్‌!

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 07:16 PM |
కాలనీలో వెలుగులు.. బస్టాండ్‌ వద్ద ప్రమాదానికి చెక్‌!

భీమదేవరపల్లి, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ఓ కాలనీలో వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు, బస్టాండ్‌ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పనులను సర్పంచ్‌ మాచర్ల కుమారస్వామి ప్రారంభించారు. ఏళ్లుగా వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు ఈ ఏర్పాటుతో ఊరట లభించనుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపుతో ప్రయాణికులకు ప్రమాద ముప్పు తగ్గనుంది. కార్యక్రమంలో ఏఈ లక్ష్మణ్‌ నాయక్‌, ఉపసర్పంచ్‌ ఐలయ్య, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యామ్‌, పంచాయతీ కార్యదర్శి మోహన్‌, లైన్‌మెన్లు బాలరాజు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

కాలనీలో వెలుగులు.. బస్టాండ్‌ వద్ద ప్రమాదానికి చెక్‌! - Additional Image