కాలనీలో వెలుగులు.. బస్టాండ్ వద్ద ప్రమాదానికి చెక్!
భీమదేవరపల్లి, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ఓ కాలనీలో వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు, బస్టాండ్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పనులను సర్పంచ్ మాచర్ల కుమారస్వామి ప్రారంభించారు. ఏళ్లుగా వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు ఈ ఏర్పాటుతో ఊరట లభించనుంది. ట్రాన్స్‌ఫార్మర్ తరలింపుతో ప్రయాణికులకు ప్రమాద ముప్పు తగ్గనుంది. కార్యక్రమంలో ఏఈ లక్ష్మణ్ నాయక్, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యామ్, పంచాయతీ కార్యదర్శి మోహన్, లైన్‌మెన్లు బాలరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.