Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఖిలా నగర్ తూర్పుకోటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవం

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Oct 2026, 06:40 PM |
ఖిలా నగర్ తూర్పుకోటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవం

ఖిలా వరంగల్, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): ఖిలా నగర్ తూర్పుకోట బస్తీ స్వయంసేవకుల ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. అత్తె భగీరథ్, వక్తగా డా. మంద శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. అత్తె భగీరథ్ మాట్లాడుతూ, చిన్నతనంలో తన తండ్రితో కలిసి ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. శాఖల్లో నిర్వహించే వ్యాయామాలు, ఆటలు, దేశభక్తి గీతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా శాఖలకు హాజరుకావడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు. డా. మంద శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవసరాలతో పాటు దేశం, సమాజం కోసం కూడా కొంత సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. స్వయంసేవకులు వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి దేశం, ధర్మం కోసం సేవలందిస్తున్నారని తెలిపారు. సమాజంలో సానుకూల మార్పు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, పంచ పరివర్తన సూత్రాలను ఆచరించాలని సూచించారు.