ఖిలా నగర్ తూర్పుకోటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవం
ఖిలా వరంగల్, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): ఖిలా నగర్ తూర్పుకోట బస్తీ స్వయంసేవకుల ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. అత్తె భగీరథ్, వక్తగా డా. మంద శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. అత్తె భగీరథ్ మాట్లాడుతూ, చిన్నతనంలో తన తండ్రితో కలిసి ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లేవాడినని గుర్తుచేసుకున్నారు. శాఖల్లో నిర్వహించే వ్యాయామాలు, ఆటలు, దేశభక్తి గీతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా శాఖలకు హాజరుకావడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు. డా. మంద శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవసరాలతో పాటు దేశం, సమాజం...