Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముల్కనూర్ శివారులో గంజాయి కలకలం.. ముగ్గురు పట్టివేత!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:23 PM |
ముల్కనూర్ శివారులో గంజాయి కలకలం.. ముగ్గురు పట్టివేత!

భీమదేవరపల్లి, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి రజినికాంత్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ శివారులోని మంగళ్ దుబ్బ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ముల్కనూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు గంజాయి ప్యాకెట్లు, ఒక ఆటో, రెండు మోటార్‌సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముల్కనూర్ ఎస్సై ఎం. రాజుకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన సిబ్బందితో కలిసి మంగళ్ దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వేపచెట్టు కింద గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల వివరాల ప్రకారం, పట్టుబడిన వ్యక్తులు కొద్ది రోజులుగా గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి ముల్కనూర్ శివారులోని మంగళ్ దుబ్బ ప్రాంతానికి వచ్చి సేవిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిని కొప్పూరు గ్రామానికి చెందిన అంబాల రాజేష్, బాకీ రాజేందర్ అలియాస్ చింటూ, ముల్కనూర్ గ్రామానికి చెందిన అలుగు అంజిగా గుర్తించారు. వారి వద్ద నుంచి మూడు గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.