ముల్కనూర్ శివారులో గంజాయి కలకలం.. ముగ్గురు పట్టివేత!

భీమదేవరపల్లి, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి రజినికాంత్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ శివారులోని మంగళ్ దుబ్బ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను ముల్కనూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు గంజాయి ప్యాకెట్లు, ఒక ఆటో, రెండు మోటార్‌సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముల్కనూర్ ఎస్సై ఎం. రాజుకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన సిబ్బందితో కలిసి మంగళ్ దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వేపచెట్టు కింద గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల వివరాల ప్రకారం, పట్టుబడిన వ్యక్తులు కొద్ది రోజులుగా గంజాయి ప్యాకెట్లు...