Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండలో క్రీడా సంబరం.. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:16 PM |
హనుమకొండలో క్రీడా సంబరం.. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు!

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. హనుమకొండలోని చారిత్రక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పాఠశాల స్థాయి అండర్‌-17, అండర్‌-19 క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ముగింపు సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమలోని క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా, క్రీడా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.