హనుమకొండలో క్రీడా సంబరం.. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు!
హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. హనుమకొండలోని చారిత్రక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పాఠశాల స్థాయి అండర్-17, అండర్-19 క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ముగింపు సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన...