Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేకాట స్థావరంపై పోలీసుల పంజా.. ఆరుగురు పట్టివేత, నగదు–వాహనాలు స్వాధీనం!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:15 PM |
పేకాట స్థావరంపై పోలీసుల పంజా.. ఆరుగురు పట్టివేత, నగదు–వాహనాలు స్వాధీనం!

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): హనుమకొండ నగరంలోని కాకతీయ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాలనీలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని వారి వద్ద ఉన్న రూ.37,690 నగదును స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సరదా, విలాసాల పేరుతో జూదానికి అలవాటుపడి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.