పేకాట స్థావరంపై పోలీసుల పంజా.. ఆరుగురు పట్టివేత, నగదు–వాహనాలు స్వాధీనం!

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): హనుమకొండ నగరంలోని కాకతీయ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాలనీలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని వారి వద్ద ఉన్న రూ.37,690 నగదును స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, పేకముక్కలను స్వాధీనం...