Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:15 PM |
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నగరంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి, శుక్రవారం సాయంత్రంలోగా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. పండుగ ఏర్పాట్లను సమీక్షించేందుకు కమిషనర్ నగరంలోని హసన్‌పర్తి, భీమారం, వడ్డేపల్లి, పద్మాక్షి గుండం, రంగలీల మైదానం తదితర ప్రధాన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, వీధి దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి ఉత్సవ ప్రాంగణాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బతుకమ్మ, దసరా వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పరిశుభ్రత, తగిన వెలుతురు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా చెరువులు, గుండాల వద్ద ప్రజల భద్రతకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవ ప్రాంగణాల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతర పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు పండుగలను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకునేలా నగరంలో అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.