బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నగరంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి, శుక్రవారం సాయంత్రంలోగా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. పండుగ ఏర్పాట్లను సమీక్షించేందుకు కమిషనర్ నగరంలోని హసన్పర్తి, భీమారం, వడ్డేపల్లి, పద్మాక్షి గుండం, రంగలీల మైదానం తదితర ప్రధాన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, వీధి దీపాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల...