Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో యువత ప్రతిభ చాటాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:13 PM |
పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో యువత ప్రతిభ చాటాలి

వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్స్‌, ఫోటోగ్రఫీలో రాష్ట్రస్థాయి పోటీలు: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపు

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల – ప్రతినిధి: మారెల్లి కిరణ్): పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు, యువత, పౌరులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ, సమాజంలో పోలీసుల సేవలు వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్స్‌, ఫోటోగ్రఫీ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. సామాజిక సమస్యలపై సృజనాత్మకంగా స్పందిస్తూ, ప్రజలకు ఉపయోగపడే సందేశాలను తమ రచనలు, చిత్రాల ద్వారా అందించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర వంటి అంశాలను ప్రతిబింబించేలా ఎంట్రీలు రూపొందించాలని తెలిపారు.

పోటీలకు ముఖ్యమైన తేదీలు: (వ్యాసరచన పోటీలు: అక్టోబర్ 27, 28, షార్ట్ ఫిల్మ్స్‌, ఫోటోగ్రఫీ: అక్టోబర్ 30). కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఎంట్రీలను అధికారిక పోలీస్ ఫ్లాగ్ డే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలని సీపీ సూచించారు. నిర్ణీత గడువులోగా ఎంట్రీలను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఈ పోటీల ద్వారా యువతలో సామాజిక బాధ్యత, సృజనాత్మకత పెంపొందడంతో పాటు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి