పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో యువత ప్రతిభ చాటాలి
వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీలో రాష్ట్రస్థాయి పోటీలు: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపు హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల – ప్రతినిధి: మారెల్లి కిరణ్): పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు, యువత, పౌరులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ, సమాజంలో పోలీసుల సేవలు వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ విభాగాల్లో...