Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వంగర ఎస్సైగా ఎం. రాజు బాధ్యతల స్వీకరణ.. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల అభినందనలు

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:13 PM |
వంగర ఎస్సైగా ఎం. రాజు బాధ్యతల స్వీకరణ.. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల అభినందనలు

వంగర, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. రాజును ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గురువారం ఆయనను శాలువాతో సత్కరించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్సై ఎం. రాజుకు అభినందనలు తెలియజేశారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ, మండల అధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు కాదాసు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి దిలీప్, అధికార ప్రతినిధి మాడ్గుల ప్రణయ్, రాంనగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకం రమేష్, హనుమకొండ జిల్లా సీనియర్ నాయకులు పార్నందుల సురేష్, బొల్లంపల్లి జోసఫ్, బుగ్గ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.