వంగర ఎస్సైగా ఎం. రాజు బాధ్యతల స్వీకరణ.. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతల అభినందనలు
వంగర, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. రాజును ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గురువారం ఆయనను శాలువాతో సత్కరించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్సై ఎం. రాజుకు అభినందనలు తెలియజేశారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ, మండల అధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు కాదాసు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి దిలీప్,...