Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భద్రకాళి ఆలయ పాలకమండలిలో గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరికి మరోసారి అవకాశం!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:10 PM |
భద్రకాళి ఆలయ పాలకమండలిలో గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరికి మరోసారి అవకాశం!

హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): చారిత్రక వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ధర్మకర్తలుగా పనిచేసిన గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరి దంపతులకు నూతన పాలకమండలిలో మరోసారి అవకాశం లభించింది. గత పాలకవర్గంలో ఆలయ అభివృద్ధికి వారు అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం రెండోసారి అవకాశం కల్పించింది. దీంతో అమ్మవారి సేవలో మరోసారి భాగస్వాములు కానుండటంపై వారి అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకమండలిలో ఉన్న సమయంలో ఆలయానికి నూతన రంగులు వేయించడం, భారీ ధ్వజస్తంభం ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం రోజుకు మూడు ట్రిప్పుల ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం, భారీ రథం ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరి దంపతులు కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో పాలకమండలిలో సమన్వయం సాధిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలోనూ వారు చొరవ చూపారని పేర్కొన్నారు.
భద్రకాళి అమ్మవారి సేవలో మరోసారి భాగస్వాములు కావడం పట్ల గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పాలకమండలిలో వారికి మరోసారి అవకాశం లభించడంపై పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వారు కృషి చేయాలని ఆకాంక్షించారు.