భద్రకాళి ఆలయ పాలకమండలిలో గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరికి మరోసారి అవకాశం!
హనుమకొండ, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): చారిత్రక వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ ధర్మకర్తలుగా పనిచేసిన గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోత్కూరి రాము మయూరి దంపతులకు నూతన పాలకమండలిలో మరోసారి అవకాశం లభించింది. గత పాలకవర్గంలో ఆలయ అభివృద్ధికి వారు అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం రెండోసారి అవకాశం కల్పించింది. దీంతో అమ్మవారి సేవలో మరోసారి భాగస్వాములు కానుండటంపై వారి అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకమండలిలో ఉన్న సమయంలో ఆలయానికి నూతన రంగులు వేయించడం, భారీ ధ్వజస్తంభం ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం రోజుకు మూడు ట్రిప్పుల ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం, భారీ రథం ఏర్పాటు...