Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. పనులు వేగవంతం చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 10:19 PM |
అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. పనులు వేగవంతం చేయాలి

అసిఫాబాద్‌, అక్టోబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను శాఖల మధ్య సమన్వయంతో వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూములకు సంబంధించిన సమస్యల కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి పనులు ముందుకు సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.