అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. పనులు వేగవంతం చేయాలి

అసిఫాబాద్‌, అక్టోబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను శాఖల మధ్య సమన్వయంతో వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించి వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో...