Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు బలవన్మరణం

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 09:08 PM | TELANGANA
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు బలవన్మరణం

📌 భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపం


  • వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు

మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 4: భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలోనే బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కోయిలకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పారుపల్లి గ్రామానికి చెందిన పసుల లవప్ప (54) శనివారం తెల్లవారుజామున కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. లవప్పకు వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన ఎకరం భూమికి సంబంధించిన వివాదం కొంతకాలంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం లవప్ప పలుమార్లు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

భూ వివాదం నేపథ్యంలో పక్క పొలం రైతులతో ఘర్షణలు జరగడంతో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. గ్రామంలో జరిగిన పంచాయతీలో తనను అవమానించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారని లవప్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న కోయిలకొండ ఎస్సై నాగరాజు, రూరల్‌ సీఐ గాంధీనాయక్, తహసీల్దార్‌ దీపక్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వద్ద సూసైడ్‌ నోట్‌ లభించినట్లు సమాచారం. తన తండ్రి మృతికి కొందరి వేధింపులే కారణమని కుమారుడు కురుమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి