తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు బలవన్మరణం
📌 భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపం వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు మహబూబ్‌నగర్, అక్టోబర్ 4: భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కోయిలకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పారుపల్లి గ్రామానికి చెందిన పసుల లవప్ప (54) శనివారం తెల్లవారుజామున కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. లవప్పకు వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన ఎకరం భూమికి సంబంధించిన వివాదం...