Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వైఎస్ఆర్ నగర్‌లో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:44 AM |
వైఎస్ఆర్ నగర్‌లో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్

* ప్రాణాలు పోతేనే అధికారులు స్పందిస్తారా?
* రాత్రివేళ వీధి దీపాలు లేక ప్రమాదాల ముప్పు

జవహర్‌నగర్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్‌లో రోడ్డుపై ఎత్తుగా నిర్మించిన డ్రైనేజీ మ్యాన్‌హోల్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రహదారిపై మ్యాన్‌హోల్ ఎత్తుగా ఉండటంతో అటుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాన్‌హోల్ కనిపించక పలువురు ద్విచక్ర వాహనదారులు దానిని ఢీకొని గాయపడుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రాణనష్టం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మ్యాన్‌హోల్‌ను రోడ్డు స్థాయికి సమానంగా సరిచేయాలని, వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించకముందే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.