Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇంటర్మీడియట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదు.. ఊహాగానాలను నమ్మొద్దన్న ఇంటర్ బోర్డు!

Author
Posted By Marelli kiran
| 18 Nov 2026, 07:40 AM |
ఇంటర్మీడియట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదు.. ఊహాగానాలను నమ్మొద్దన్న ఇంటర్ బోర్డు!

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేసే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఇంటర్మీడియట్ విద్యా మండలి స్పష్టం చేసినట్లు సమాచారం. సిలబస్ మారుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు, ఊహాగానాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని సూచించింది.

నూతన విద్యా విధానం అమలుకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అధికారికంగా మార్గదర్శకాలు విడుదలయ్యే వరకు సిలబస్‌పై వస్తున్న ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 12వ తరగతి వరకు ఒకే ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేయాలని పలువురు విద్యావేత్తలు బోర్డుకు సూచించినట్లు సమాచారం.

ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు కేవలం 9, 10 తరగతుల నిర్వహణకే పరిమితం చేయకుండా, ఒకటో తరగతి నుంచే పాఠశాల తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతులు కల్పించాలని వారు కోరినట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టే సమయంలో విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలను దృష్టిలో ఉంచుకోవాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి