Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వచ్చే నెలలో పీవీ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం

Author
Posted By Nagilla Rajinikanth
| 17 Nov 2026, 03:46 PM |
వచ్చే నెలలో పీవీ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం

భీమదేవరపల్లి, నవంబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్రం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఫోటో గ్యాలరీ, మ్యూజియం, కాన్ఫరెన్స్ హాల్, ఆర్ట్ గ్యాలరీతో పాటు ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విజ్ఞాన కేంద్రంలో దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఆర్ట్ గ్యాలరీ పనులు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్ట్ గ్యాలరీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాల అమరిక తదితర పనులను ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాంగణంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వచ్చే నెలలో పీవీ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం - Additional Image

పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి వచ్చే నెలలో పీవీ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సృజన, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహసీల్దార్ రాజేష్, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వచ్చే నెలలో పీవీ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం - Additional Image