Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Author
Posted By Nagaraju Golla
| 17 Nov 2026, 03:43 PM |
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఆత్మకూరు, నవంబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జీఎస్ఆర్ గార్డెన్స్‌లో మండల పరిధిలోని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ కొత్త పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఇందిరా మహిళా డైరీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, సన్నబియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.